ఏమైనా జరగొచ్చు! అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్లతో సీఎస్

సాక్షి, హైదరాబాద్: ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ సహా.. 16 వరద ప్రభావిత జిల్లాలపై సమీక్షించారు. టెలీ కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లు, పోలీసు అధికారులతో మాట్లాడారు. వర్సాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. అన్ని జిల్లాల్లో వరదలపై కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. తాగు, సాగునీరు, విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండొద్దని సీఎస్ సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు.