మెగా డెయిరీ నమూనా సిద్ధం చేయండి  | Talsani asks officials for Mega dairy blue print | Sakshi
Sakshi News home page

మెగా డెయిరీ నమూనా సిద్ధం చేయండి 

Jul 31 2020 5:09 AM | Updated on Jul 31 2020 5:09 AM

Talsani asks officials for Mega dairy blue print - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మెగా డెయిరీ నిర్మాణానికి నమూనా సిద్ధం చేయాలని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా మామిడి పల్లిలో మెగా డెయిరీ నిర్మాణం కోసం పశుసంవర్థక శాఖకు చెందిన 32 ఎకరాల భూమిని విజయ డైయిరీకి 99 ఏళ్లు లీజుకు ఇస్తూ మంత్రి తలసాని, పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర సమక్షంలో ఆ శాఖ డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి, డెయిరీ ఎండీ శ్రీనివాస్‌రావులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆధునిక టెక్నాలజీతో రూ.250 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే మెగా డైయిరీ నుంచి మరిన్ని విజయ ఉత్పత్తులు ప్రారంభించాలని కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement