సమ్మర్‌ ఎఫెక్ట్‌: టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం​ | Summer Effect Tsrtc Key Decision In Hyderabad Zone | Sakshi
Sakshi News home page

సమ్మర్‌ ఎఫెక్ట్‌: టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం​

Apr 15 2024 8:35 PM | Updated on Apr 15 2024 8:53 PM

Summer Effect Tsrtc Key Decision In Hyderabad Zone  - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: సిటీలో ఆర్టీసీ బస్సులపై సమ్మర్ ఎఫెక్ట్ పడింది. ఎండల తీవ్రతతో హైదరాబాద్‌ నగర పరిధిలో బస్సు సర్వీసులను టీఎస్‌ఆర్టీసీ తగ్గించనుంది. మధ్యాహ్నం 12 గంటల 4 గంటల వరకు గతం కంటే తక్కువ బస్సులను నడపనున్నట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్‌ జోన్ అధికారులు వెల్లడించారు.  

అయితే సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సిటీలో బస్సులను యధావిధిగా నడపనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 17 నుంచి సిటీలో మధ్యాహ్నం వేళల్లో బస్సులు తగ్గనున్న విషయాన్ని ప్రయాణికులు గమనించాలని ఆర్టీసీ అధికారులు కోరారు. 

ఇదీ చదవండి.. తెలంగాణకు వర్ష సూచన.. 10 రోజుల పాటు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement