Summer Effect: Tribals Adilabad District Tembriguda Facing Water Problems See Inside - Sakshi
Sakshi News home page

Summer Effect Photo Feature: ‘దాహా’కారాలు

Apr 14 2022 11:39 AM | Updated on Apr 14 2022 3:11 PM

Summer Effect Tribals Adilabad District Tembriguda Facing Water Problems - Sakshi

చెలిమ నీటి కోసం నిరీక్షిస్తున్న గిరిజనులు

రోజురోజుకూ ఎండ తీవ్రతరం అవుతోంది. గిరిజనులకు తాగునీటి కష్టాలు మిగుల్చుతోంది. నీటికోసం కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి చెలిమ నీటిని తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. బావులు, కాలువలు ఎండిపోవడంతో ఆ నీరే దిక్కయింది. చిన్నాపెద్దా తేడా లేకుండా గంటలకొద్దీ నిరీక్షించి వచ్చే కొద్దిపాటి నీటి కోసం తంటాలు పడుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం టెంబ్రిగూడలో వందమంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరంతా నీటికోసం అల్లాడుతున్నారు. కిలోమీటరు దూరంలోని చెలిమ వద్దకు వెళ్లి నీరు తెచ్చుకోవలసి వస్తోంది.     
 – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‌

నెత్తిన బిందెలు ఎత్తుకొని నడిచి వెళ్తున్న గ్రామస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement