భారీగా దివ్యాంగుల మెస్‌ చార్జీల పెంపు

State Government Increased Mess Charges For Physically Handicapped - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దివ్యాంగుల మెస్‌ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. సాధారణ విద్యార్థుల కంటే కనీసం 25% అధి కంగా మెస్‌ చార్జీలు చెల్లించాలని వికలాంగుల చట్టం–2016 చెబుతోంది. ఇందులో భాగంగా మెస్‌ చార్జీలు పెంచాలని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపింది. దీంతో స్పందించిన ప్రభుత్వం రెండ్రో జుల క్రితం పెంచిన మెస్‌ చార్జీలపై నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి డి.దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప్రీమెట్రిక్‌ కేటగిరీలో 3 నుంచి 7వ తరగతి దివ్యాంగ విద్యార్థులకు నెలకు రూ.950 నుంచి రూ.1200కు పెంచింది. 8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1500కు పెంచింది. పోస్టుమెట్రిక్‌ కేటగిరీలో ఇంటర్‌ నుంచి పీజీ వరకు చదివే దివ్యాంగ విద్యా ర్థులకు నెలకు రూ.1500 నుంచి రూ.2 వేలకు పెంచింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top