శ్రీశైలం, జూరాల గేట్లు మూసివేత | Srisailam Crest Gates Closed | Sakshi
Sakshi News home page

శ్రీశైలం, జూరాల గేట్లు మూసివేత

Jul 26 2022 2:05 AM | Updated on Jul 26 2022 8:12 AM

Srisailam Crest Gates Closed - Sakshi

మూసివేసిన శ్రీశైలం ఆనకట్ట గేట్లు  

గద్వాల రూరల్‌/దోమలపెంట: ఎగువ నుంచి వస్తున్న వరద నీరు తగ్గడంతో శ్రీశైలం, జూరాల ప్రాజెక్టు గేట్లను మూసి వేశారు. జూరాల ప్రాజెక్టుకు 23,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యుత్‌ ఉత్పత్తి కోసం 19,505 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రా జెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.701టీఎంసీలను నిల్వ చేశారు.

మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు సాయంత్రం 6 గంటలకు జూరాల నుంచి 19,501, సుంకేసుల నుంచి 8,414 క్యూసెక్కులు మొత్తం 27,915 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం 881.6 అడుగులు, 196.561 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement