కరోనా వ్యాక్సిన్‌: స్పుత్నిక్‌–వి భేష్‌.. సామర్థ్యం ఎంతంటే?

The Sputnik-V Vaccine Is Manufacturing Starting In India - Sakshi

వ్యాక్సిన్‌తో దుష్ప్రభావాలు తక్కువే

భారత్‌లో రష్యా వ్యాక్సిన్‌ తయారీ ప్రారంభం

91.6% సామర్థ్యం ఉంటుందని అంచనా..

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు భారత్‌లో ఇంకో టీకా అందుబాటులోకి వచ్చేసింది. రష్యాలోని గమలేయా సంస్థ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ ఇకపై భారత్‌లోనూ తయారుకానుంది. ప్రస్తుతానికి రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న టీకాలనే భారత్‌లో వినియోగిస్తున్నాం. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌లతో పోలిస్తే స్పుత్నిక్‌–వి కొంచెం భిన్నమైన టీకా. నిర్వీర్యం చేసిన కరోనా వైరస్‌తో కోవాగ్జిన్‌ టీకా తయారైతే.. కోవిషీల్డ్‌లో కరోనా వైరస్‌ కొమ్ములను పోలిన వాటిని వినియోగించారు. ఈ రెండు పద్ధతుల కంటే భిన్నంగా స్పుత్నిక్‌–వి తయారైంది. రెండు డోసుల ఈ టీకాలో రెండు వేర్వేరు అడినోవైరస్‌లను ఉపయోగించారు. సాధారణ జలుబుకు  కారణమైన ఏడీ26, ఏడీ5 వైరస్‌లతో రెండు డోసులు సిద్ధమవుతాయి.

తొలిడోసులో ఏడీ26 వైరస్‌ ఉంటే.. రెండో డోసులో ఏడీ5 వైరస్‌ ఉంటుంది. ఈ మిశ్రమం వల్ల శరీరంలో యాంటీబాడీల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కోవాగ్జిన్‌ విషయంలో రెండు డోసుల మధ్య అంతరం 4 నుంచి 6 వారాలైతే.. కోవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధి 12 నుంచి 16 వారాలు. బ్రిటన్‌లో 8 వారాల గడువు తర్వాతే రెండో డోస్‌ ఇస్తున్నారు. స్పుత్నిక్‌–వి విషయానికి వచ్చేసరికి మూడు వారాల వ్యవధిలోనే రెండో డోసు ఇచ్చేయొచ్చని చెబుతున్నారు. కోవాగ్జిన్‌ టీకా సామర్థ్యం 83 శాతం ఉంటే.. కోవిషీల్డ్‌ సామర్థ్యం 70 నుంచి 90 శాతమని అందుబాటులో ఉన్న గణాంకాలు చెబుతున్నాయి. స్పుత్నిక్‌–వి సామర్థ్యం 91.6 శాతం అని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు.

దుష్ప్రభావాలు ఉంటాయా?
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచంలో తొలిసారిగా తయారైన వ్యాక్సిన్‌గా స్పుత్నిక్‌–వి రికార్డు సృష్టించింది. గతేడాది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కుమార్తెలు ఇద్దరూ ఈ వ్యాక్సిన్‌ తీసుకున్నారని, వారికి తేలికపాటి జ్వరం తప్ప ఎలాంటి దుష్ప్రభావాలు కన్పించలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని కచ్చితంగా చెప్పలేం. మానవ ప్రయోగాల సందర్భంగా నమోదు చేసిన వివరాల ప్రకారం స్పుత్నిక్‌–వి తీసుకున్న వారిలో కొందరికి తలనొప్పి, నిస్సత్తువ, జలుబు టీకా తీసుకున్న ప్రాంతంలో నొప్పి లాంటి లక్షణాలు కన్పించాయి. అయితే ఇవన్నీ కొంత కాలంలోనే సర్దుకున్నాయని తెలుస్తోంది. ఇంతకు మించిన తీవ్రమైన దుష్ప్రభావాలేవీ ఇప్పటివరకు నమోదు కాలేదు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

16-05-2021
May 16, 2021, 13:16 IST
సాక్షి, సిటీబ్యూరో: మాతృత్వాన్ని ఆస్వాదించే అరుదైన క్షణాల కోసం నిండు గర్భిణులు కంటున్న కలలను కరోనా మహమ్మారి చిదిమేస్తోంది. చివరికి...
16-05-2021
May 16, 2021, 12:45 IST
ఐజ్వాల్‌: కరోనా వైరస్‌ రోజు రోజుకి విజృంభిస్తోంది. పేద, ధనిక తేడాలేకుండా అందరూ ఈ వైరస్‌ బారిన పడుతున్నారు. ఆస్పత్రుల్లో పడకలు,...
16-05-2021
May 16, 2021, 10:23 IST
దేశంలో కరోనా వైరస్‌ రెండోదశ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి.
16-05-2021
May 16, 2021, 09:41 IST
ఆక్సిజన్‌ అందక ఏ ఒక్కరి ప్రాణం పోకుండా ఉండేందుకు నడుం బిగించారు సోషల్‌ డేటా ఇన్‌షేటివ్స్‌ ఫోరం (ఎస్‌డీఐఎఫ్‌), యాక్సెస్‌...
16-05-2021
May 16, 2021, 07:52 IST
మేడం.... నాకు, నా భార్యకు కోవిడ్‌ వచ్చి తగ్గిపోయింది. ఈ ఉత్తరం మీకు రాసేటప్పటికి తగ్గిపోయి 20 రోజులైంది. దాంపత్య...
16-05-2021
May 16, 2021, 06:31 IST
దేశవ్యాప్తంగా కోవిడ్‌ బాధితుల్లో మ్యుకోర్‌మైకోసిన్‌ అనే అరుదైన ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తుండటంపై ఆందోళన..
16-05-2021
May 16, 2021, 06:24 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోదీ వైఖరిని విమర్శిస్తూ పోస్టర్లు వేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు 25...
16-05-2021
May 16, 2021, 06:07 IST
కరోనాకు ముందు డేటింగ్‌ యాప్‌లకు మంచి డిమాండ్‌ ఉండేది. టిండర్‌ లాంటి డేటింగ్‌ యాప్‌ యూజర్లంతా తమ జీవిత భాగస్వామి...
16-05-2021
May 16, 2021, 05:53 IST
నెల్లూరు జిల్లా వరికుంటపాడు వాస్తవ్యులు బొడ్డు నాగలక్ష్మి మనోనేత్రం సామాన్యుల కళ్ల కంటే కరోనా బాధితుల కష్టాలను మరింత చేరువగా...
16-05-2021
May 16, 2021, 05:01 IST
గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని, ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించాలని, లక్షణాలున్న వారిపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ప్రధానమంత్రి...
16-05-2021
May 16, 2021, 04:54 IST
బ్లాక్‌ ఫంగస్‌.. కోవిడ్‌ బారినపడి చికిత్స పొందుతున్న కొందరిలో తలెత్తుతున్న సమస్య ఇది.
16-05-2021
May 16, 2021, 04:21 IST
కారంపూడి (మాచర్ల): కోవిడ్‌ నుంచి ప్రజలను కాపాడే క్రమంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి నిరంతరం విధుల్లో నిమగ్నమవుతూ...
16-05-2021
May 16, 2021, 03:26 IST
కాప్రా:  కరోనా ఉందనే అనుమానంతో ఆస్పత్రులు చేర్చుకోకపోవడంతో.. ఓ నిండు గర్భిణి అంబులెన్సులోనే మృతి చెందిన ఘటనపై మేడ్చల్‌ మల్కాజిగిరి...
16-05-2021
May 16, 2021, 03:08 IST
సాక్షి, అమరావతి: కరోనా పాజిటివ్‌ కేసుల నేపథ్యంలో పల్లెటూళ్లు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మే 7వ తేదీ నుంచి...
16-05-2021
May 16, 2021, 03:07 IST
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ దానికదే వ్యాపించడం మొదలైందా? పరిశోధనలు చేస్తుండగా పొరపాటున లీకైందా? ఎవరైనా జన్యుమార్పిడి చేసి జీవాయుధంగా...
16-05-2021
May 16, 2021, 02:52 IST
సాక్షి, హైదరాబాద్‌/ సింగరేణి (కొత్తగూడెం): సింగరేణిలో కోవిడ్‌ను కట్టడి చేసేందుకు సింగరేణి సంస్థ యాజమాన్యం, ప్రభుత్వ యంత్రాంగం, గుర్తింపు యూనియన్‌...
16-05-2021
May 16, 2021, 02:38 IST
 హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌ సాగర్‌ జలాల్లో కరోనా వైరస్‌ ఆనవాళ్లు బయటపడడం కలకలం సృష్టిస్తోంది.
16-05-2021
May 16, 2021, 02:10 IST
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రజల షాపింగ్‌ వైఖరిలో గణనీయంగా మార్పులొచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా 17 దేశాలలో మార్కెట్‌...
16-05-2021
May 16, 2021, 01:41 IST
న్యూఢిల్లీ: హోం ఐసోలేషన్‌లో ఉన్న కరోనా పేషెంట్లు రెమిడెసివిర్‌ ఇంజక్షన్‌ను తీసుకోవద్దని, ఆక్సిజన్‌ స్థాయి 94కు తగ్గితే వెంటనే ఆసుపత్రిలో...
16-05-2021
May 16, 2021, 01:31 IST
కరోనా కల్లోలంతో కుటుంబాలు చితికిపోతున్నాయి. ఇన్నాళ్లూ సంతోషంగా గడిపిన కుటుంబాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇంటికి ఆధారమైన కుటుంబ పెద్దను కోల్పోయిన ఆవేదన ఓ వైపు.....
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top