హైదరాబాద్: తెలంగాణకు గుడ్ న్యూస్. నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రాన్ని తాకాయి. గద్వాల జిల్లాలోకి ప్రవేశించాయి. నైరుతి రుతుపవనాల రాకతో వర్షాకాలం ప్రారంభమైందని భావిస్తాం. ఇప్పటికే ఇవి కేరళ, తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా విస్తరించాయి. ఏపీ, మహారాష్ట్రలో 30 శాతం విస్తరించాయి నైరుతి రుతుపవనాలు.
కాగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వరకు విస్తరించాయని, ప్రస్తుతం తెలంగాణ దక్షిణ సరిహద్దులోకి ప్రవేశించే స్థితిలో ఉన్నాయని తెలిపింది. చెప్పినట్లే ఇవాళ తెలంగాణలోకి ప్రవేశించాయి.
“పరిస్థితులు అనుకూలంగా ఉంటే.. రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించడానికి కేవలం 2 నుంచి 3 రోజులు చాలు” అని అధికారులు తెలిపారు. దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు.
తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులు, ఉరుములతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


