TSPSC Paper Leak Case: SIT Arrested Two More Accused - Sakshi
Sakshi News home page

TSPSC: పేపర్‌ లీక్‌లో​ మరో ట్విస్ట్‌.. ఎంపీడీవో ఆఫీసు ఉద్యోగి అరెస్ట్‌

May 5 2023 10:31 AM | Updated on May 5 2023 11:30 AM

SIT Arrested Two More Accused In TSPSC Paper Leak Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, పేపర్‌ లీకేజీ కేసులో సిట్‌ స్పీడ్‌ పెంచింది. ఈ కేసులో​ తాజాగా మరో ఇద్దరిని సిట్‌ అరెస్ట్‌ చేసింది. వికారాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతడి తమ్ముడు రవికుమార్‌ను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. 

వివరాల ప్రకారం.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో నిందితుడిగా ఉన్న డాక్యా నాయక్‌ నుంచి ఏఈ పేపర్‌ను తన తమ్ముడు రవి కోసం భగవంత్‌ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని అరెస్ట్‌ చేసినట్టు సిట్‌ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డాక్యా నాయక్‌ ఖాతాలను విశ్లేషించగా.. రూ.2లక్షలకు భగవంత్‌ ఏఈ పేపర్‌ కొనుగోలు చేసిన విషయం బయటపడినట్లు సిట్‌ వెల్లడించింది. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో నిందితులకు రూ.33.4 లక్షలు అందినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు.

ఇది కూడా చదవండి: పొంగులేటి, జూపల్లితో భేటీపై ఈటల రాజేందర్‌ ఏమన్నారంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement