రాజకీయ ఒత్తిడిపై దృష్టి | Singareni JAC Holds For Cancellation Of Coal Blocks Privatisation | Sakshi
Sakshi News home page

రాజకీయ ఒత్తిడిపై దృష్టి

Dec 5 2021 3:53 AM | Updated on Dec 5 2021 8:18 AM

Singareni JAC Holds For Cancellation Of Coal Blocks Privatisation - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: బొగ్గు బ్లాక్‌లను అమ్మే ప్రయత్నా లపై సమ్మె అస్త్రం ప్రయోగించిన సింగరేణి కార్మిక సంఘాలు రాజకీయ పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి. బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కార్మిక సంఘాల జేఏసీ 72 గంటల సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగరేణి మనుగడను ప్రశ్నార్థకం చేసే ప్రైవేటీకరణ ప్రయ త్నాలను విరమించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురా వాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా రెండురోజుల క్రితం రాష్ట్ర రాజధానికి చేరుకున్న కార్మిక సంఘాల జేఏసీ నేతలు సింగరేణి యాజమాన్యంతో చర్చించారు. సమ్మె విర మించాలని కోరినా ససేమిరా అన్నారు. అక్కడే బస చేసి శని వారం డైరెక్టర్‌(పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్ఫేర్‌–పీఏ డబ్ల్యూ)ను కలసి ప్రైవేటీకరణను రద్దు చేయాలనే కీలక అంశంతోపాటు కార్మికుల సమస్యలతో కూడిన సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్ర టరీ, సంస్థ మాజీ సీఎండీ నర్సింగ్‌రావును కలసి సీఎం కేసీ ఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలన్నారు.

ఆ తర్వాత అన్ని పార్టీల నేతలు, పార్టీ ఎంపీలను కలవాలని నిర్ణయించారు. తొలుత టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. మరోవైపు సింగరేణి బొగ్గు బ్లాక్‌ల బిడ్‌లో పాల్గొంటే ఇక్కడ వ్యతిరేకతతోపాటు హైదరాబాద్‌లోని బిడ్‌ కాంట్రాక్టుకు చెందిన కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. కాగా, సింగరేణి సంస్థ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని సంఘాలు ఏకమై సమ్మెకు పిలుపునివ్వగా కోల్‌మైన్స్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీఎంవోఏఐ) అధికారుల సంఘం ఇప్పటివరకు తన వైఖరిని వెల్లడించలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement