breaking news
coal blocks issue
-
రాజకీయ ఒత్తిడిపై దృష్టి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బొగ్గు బ్లాక్‌లను అమ్మే ప్రయత్నా లపై సమ్మె అస్త్రం ప్రయోగించిన సింగరేణి కార్మిక సంఘాలు రాజకీయ పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నాయి. బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కార్మిక సంఘాల జేఏసీ 72 గంటల సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. సింగరేణి మనుగడను ప్రశ్నార్థకం చేసే ప్రైవేటీకరణ ప్రయ త్నాలను విరమించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురా వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండురోజుల క్రితం రాష్ట్ర రాజధానికి చేరుకున్న కార్మిక సంఘాల జేఏసీ నేతలు సింగరేణి యాజమాన్యంతో చర్చించారు. సమ్మె విర మించాలని కోరినా ససేమిరా అన్నారు. అక్కడే బస చేసి శని వారం డైరెక్టర్(పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ వెల్ఫేర్–పీఏ డబ్ల్యూ)ను కలసి ప్రైవేటీకరణను రద్దు చేయాలనే కీలక అంశంతోపాటు కార్మికుల సమస్యలతో కూడిన సమ్మె నోటీసు అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్ర టరీ, సంస్థ మాజీ సీఎండీ నర్సింగ్రావును కలసి సీఎం కేసీ ఆర్ అపాయింట్మెంట్ ఇప్పించాలన్నారు. ఆ తర్వాత అన్ని పార్టీల నేతలు, పార్టీ ఎంపీలను కలవాలని నిర్ణయించారు. తొలుత టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. మరోవైపు సింగరేణి బొగ్గు బ్లాక్‌ల బిడ్‌లో పాల్గొంటే ఇక్కడ వ్యతిరేకతతోపాటు హైదరాబాద్‌లోని బిడ్ కాంట్రాక్టుకు చెందిన కార్యాలయాల ముందు ధర్నా నిర్వహించాలని జేఏసీ నేతలు నిర్ణయించారు. కాగా, సింగరేణి సంస్థ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని సంఘాలు ఏకమై సమ్మెకు పిలుపునివ్వగా కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంవోఏఐ) అధికారుల సంఘం ఇప్పటివరకు తన వైఖరిని వెల్లడించలేదు. -
పార్లమెంట్‌ను కుదిపేసిన ఫైళ్ల గల్లంతు వ్యవహారం
న్యూఢిల్లీ : బొగ్గు కుంభకోణంలో ఫైళ్ల గల్లంతు వ్యవహారం గురువారం పార్లమెంట్‌ను కుదిపేసింది. దాదాపు 257 ఫైళ్లు మాయం అయ్యాయనే అనుమానాలపై ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ స్పందించాలంటూ బీజేపీ సభ్యులు ఉభయసభలను స్తంభింపచేశారు. లోక్‌సభలో ఈ విషయాన్ని ప్రస్తావించిన బీజేపీ సభ్యులు.... ప్రధాని మౌనం వీడాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో కూడా బీజేపీ సభ్యులు తమ పట్టు కొనసాగించారు. ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేస్తున్నా ప్రధానమంత్రి మాత్రం మౌనంగా చూస్తూ కూర్చుండిపోయారు. అయితే కీలకమైన ఆహారభద్రత బిల్లుకు ఆమోదం పొందాలనే పట్టుదలతో ఉన్న యూపీఏ.... విపక్షసభ్యులను శాంతపరిచేందుకు సిద్దమైంది. ఫైళ్ల గల్లంతు వ్యవహారంపై ప్రధాని జోక్యం చేసుకుని వివరణ ఇస్తారని కేంద్రమంత్రి రాజీవ్‌శుక్లా రాజ్యసభలో తెలిపారు. అంతేకాకుండా ఆహారభద్రత బిల్లు, భూసేకరణ బిల్లులకు ఆమోదం సాధించాలని భావిస్తున్న యూపీఏ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మరో అయిదు రోజులు పొడిగించింది. దీంతో సెప్టెంబర్ 5 వరకు సమావేశాలు జరుగనున్నాయి