రైతు కల్లాల నిర్మాణంలో సిద్దిపేట ప్రథమ స్థానం

Siddipet Collector Review Mallanna Sagar Rehabilitation Colony - Sakshi

గజ్వేల్‌:  మల్లన్నసాగర్‌ ముంపు బాధితుల కోసం నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని సకల హంగులతో సిద్ధం చేయాలని కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. శనివారం గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలీటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లిలో నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పనుల ప్రగతిపై సైట్‌ వద్ద సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ   ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు, సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణంపై ఆరా తీశారు.  సమీక్షలో ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌ తివారీ, గజ్వేల్‌ ఆర్‌డీఓ విజయేందర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ ఎస్‌ఈ కనకరత్నం, మిషన్‌ భగీరథ ఈఈ రాజయ్య, ఈడబ్ల్యూఐడీసీ డీఈ రాంచంద్రం, పీఆర్‌ డిప్యూటీ ఈఈ ప్రభాకర్, తహశీల్ధార్లు అన్వర్, అరుణ తదితరులు పాల్గొన్నారు. 

రైతు కల్లాల నిర్మాణంలో జిల్లా ప్రథమం
ములుగు(గజ్వేల్‌): రైతు కల్లాల నిర్మాణంలో రాష్ట్రంలోనే  జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని, పల్లె ప్రకృతి వనాలతోగ్రామాల్లో పచ్చదనం వెల్లి విరుస్తుందని  కలెక్టర్‌  వెంకట్రావిమిరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌ గ్రామంలో శనివారం కల్లం నిర్మాణంతో పాటు పల్లె పకృతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా పల్లె ప్రకృతి వనంలో నాటిన మొక్కలు, కేబీఆర్‌ పౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిమెంట్‌ బెంచీలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.  కలెక్టర్‌ అధికారులను, గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు కొన్యాల మమత, సర్పంచ్‌ కాయితి యాదమ్మ, కేబీఆర్‌ పౌండేషన్‌ చైర్మన్‌ కొన్యాల బాల్‌రెడ్డిలను అభినందించారు. ట్రైనీ కలెక్టర్‌ దీపక్‌తివారీ, డీఆర్‌డీఏ పీడీ గోపాల్‌రావు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి కలెక్టర్‌ ప్రకృతి వనంలో మొక్కను నాటి నీరు పోశారు. కార్యక్రమంలో ములుగు ఎంపీపీ లావణ్యఅంజన్‌గౌడ్, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి, ఉపాథిహామి ఏపీడీ కౌసల్యాదేవి, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top