
ఆలయంలో పండిత గోష్టి నిర్వహిస్తున్న శంకర విజయేంద్ర సరస్వతి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం అద్భుతంగా ఉందని కంచి కామకోటి మఠం పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ఆయన గురువారం సాయంత్రం పంచనారసింహుల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు శంకర విజయేంద్ర సరస్వ తి స్వామీజీకి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
గర్భాలయంలో స్వయంభువులు, బంగారు ప్రతిష్ట మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలో ఆలయ ఆచార్యులతో పండిత గోష్టి నిర్వహించారు. అధికారులు, సిబ్బందితో ఆలయ నిర్మాణ విశేషాలపై చర్చించారు.