సెక్రటేరియట్‌లో విజిటర్లపై నిఘా..! | Security Tightens In Telangana Secretariat, Know Reasons Inside | Sakshi
Sakshi News home page

TG: సెక్రటేరియట్‌లో విజిటర్లపై ఇక నిరంతర నిఘా..కారణమిదే..

Jan 31 2025 2:54 PM | Updated on Jan 31 2025 4:57 PM

Security Tightens In Telangana Secretariat

సాక్షి,హైదరాబాద్‌:తెలంగాణ సెక్రటేరియట్‌లో భద్రతను అధికారులు కట్టుదిటం చేశారు. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఎస్‌పీఎఫ్‌) ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌ భద్రత మరింత పెంచనున్నారు. భద్రత 24 గంటల పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. 300 సీసీకెమెరాలతో సెక్రటేరియట్‌ బయట లోపలు నిరంతర నిఘా ఉంచనున్నారు.

విజిటర్లు సెక్రటేరియట్‌లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయ్యేవరకు వారి కదలికలను పోలీసులు రికార్డు చేయనున్నారు. ఇటీవలే సెక్రటేరియట్‌లో నకిలీ ఐడీ కార్డుతో అధికారిగా చెలామణి అయిన ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే.

దీంతో సెక్రటేరియట్‌లో ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించాలని ఎస్పీఎఫ్‌ నిర్ణయించింది. సెక్రటేరియట్‌లో రికార్డైన మొత్తం డేటాను 5 నెలలపాటు అందుబాటులో ఉంచేలా సర్వర్లను ఏర్పాటు చేశారు. 

సచివాలయంలో ప్రతిరోజు సీఎం సహా మంత్రులు ఐఏఎస్‌ అధికారులు  విధులు నిర్వహిస్తుంటారు. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement