వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్: సికింద్రాబాద్‌ టూ విశాఖ.. పలు స్టేషన్ల ఛార్జీల వివరాలు ఇవే

Secunderabad to Visaka Vande Bharat Express Train Fare Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ ఆదివారం నుంచి తెలుగు రాష్ట్రాలకు అందుబాటులోకి రానుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. సంక్రాంతి రోజున ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనుండగా, సికింద్రా­బాద్‌ స్టేషన్‌లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జెండా ఊపనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి తొలి పరుగు ప్రారంభించనుంది. సోమవారం విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు రానుంది. 

ఈ రైలు సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నానికి కేవలం ఎనిమిదిన్నర గంటల్లో చేరుకుంటుంది. సికింద్రాబాద్‌ నుంచి 697 కి.మీ. (రైలు మార్గం) దూరంలో ఉన్న విశాఖకు చేరుకునేందుకు ప్రస్తుతం మిగతా సూపర్‌ఫాస్ట్‌ రైళ్లలో సగటున 12 గంటలు పడుతోంది. కానీ వందేభారత్‌ వాటి కంటే మూడున్నర గంటల నుంచి నాలుగు గంటల ముందే చేరుకునేలా పరుగుపెట్టనుంది. జనవరి 15న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదే ఇక, సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు వెళ్లే వందే భారత్‌ రైలుకు శనివారం నుంచే ఐఆర్‌సీటీసీలో బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. 

ఛార్జీలు ఇలా ఉన్నాయి.. 
సికింద్రాబాద్ టు వరంగల్ - 520/-

సికింద్రాబాద్ టు ఖమ్మం - 750/-

సికింద్రాబాద్ టు విజయవాడ - 905/-

సికింద్రాబాద్ టు రాజమండ్రి - 1365/-

సికింద్రాబాద్ టు విశాఖపట్నం - 1665/-(CC)

సికింద్రాబాద్ టు విశాఖపట్నం - 3120/-(EC). 

గుర్తుకొచ్చేది వేగమే... 
వందే భారత్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది దాని వేగమే. గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. అయితే, దాని వేగం అధికంగానే ఉన్నా, అంత వేగాన్ని తట్టుకునే ట్రాక్‌ సామర్థ్యం మనకు లేదు. ఈ మార్గంలో రైళ్ల గరిష్టవేగ పరిమితి 130 కి.మీ. మాత్రమే ఉంది. కానీ గరిష్ట పరిమితితో కాకుండా వందేభారత్‌ రైలు సగటున 90–100 కి.మీ. వేగంతోనే పరుగుపెట్టనుంది. ప్రస్తుతం ఇతర సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ల సగటు గరిష్ట వేగం గంటకు 60 కి.మీ. మాత్రమే ఉంది.

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top