Morning News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం

Sakshi Breaking News Trending News Morning News Roundup 29th Sep 2022

1. ముగ్గురు ఎమ్మెల్యేల హత్యకు కుట్ర? టైమ్‌బాంబు తరహా పేలుళ్లకు మావోయిస్టుల ప్లాన్‌?
ఉత్తర తెలంగాణలో గోదావరి తీరంలో మావోయిస్టులు అలజడికి వేసిన ప్రణాళికను నిఘావర్గాలు, పోలీసులు ముందుగానే గుర్తించారు. బెల్లంపల్లి, చెన్నూర్, రామగుండం ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, బాల్క సుమన్, కోరుకంటి చందర్‌ను హతమార్చేందుకు రెక్కీ కూడా నిర్వహించినట్లు నిఘావర్గాలు గుర్తించాయి.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2.గుడ్‌ న్యూస్‌.. 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌
రాష్ట్రంలో వివిధ కేటగిరీల్లోని 269 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. గ్రూప్‌–4, మెడికల్‌ ఆఫీసర్లు, లెక్చరర్‌ తదితర పోస్టులు వీటిలో ఉన్నాయి. 

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3. రష్యాకే జైకొట్టిన ఉక్రేనియన్లు.. త్వరలో లాంఛనంగా విలీనం!
ఉక్రెయిన్‌లోని డొనెట్స్‌క్, లెహాన్స్‌క్, జపోరిజియా, ఖెర్సన్‌ తదితర ఆక్రమిత ప్రాంతాలను లాంఛనంగా విలీనం చేసుకునేందుకు రష్యా చేస్తున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయి. 

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4. ‘మిషన్‌ తెలంగాణ’పై ఫుల్‌ ఫోకస్ పెట్టిన బీజేపీ 
తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. ‘మిషన్‌ తెలంగాణ–2023’కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా గెలిచి కాషాయజెండా ఎగురవేసి తీరాలన్న ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల నిర్దేశిత లక్ష్యసాధన దిశగా పకడ్బందీ వ్యూహాలను రచిస్తోంది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5. ఘోర రోడ్డు ప్రమాదం.. గాయపడిన చిన్నారిని చూసి కన్నీరు పెట్టుకున్న మహిళా అధికారి
ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరీ పరిధిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 41 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిచించి చికిత్స అందిస్తున్నారు.  730 నంబర్‌ జాతీయ రహదారిపై బస్సు, మినీ ట్రక్‌ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6. గుండెపోటు ఎలా గుర్తించాలి.. గుండెపోటు రాకుండా ఉండాలంటే..
ఈ బిజీ జీవితంలో ఒత్తిడులు, శారీరక శ్రమ లేకపోవడం మన గుండెను ప్రమాదంలోకి నెడుతోంది. మారిన ఆహార అలవాట్లు గుండె నాళాలను దెబ్బతీస్తున్నాయి. ఈ రోజు వరల్డ్‌ హార్ట్‌ డే.. అందువల్ల మన గుండెను మనం ఎంత ప్రమాదంలోకి నెడుతున్నామో తెలుసుకోవాల్సిన అవసరముంది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7. మనకి అన్ని ప్రభుత్వ బ్యాంకులు అవసరం లేదు: ఎస్‌బీఐ మాజీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు
దేశీయంగా పటిష్టమైన ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) కొన్ని ఉన్నా సరిపోతుందని ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ మాజీ చైర్‌పర్సన్‌ అరుంధతి భట్టాచార్య అభిప్రాయపడ్డారు. చిన్నా చితకా పీఎస్‌బీలను విలీనమో లేదా ప్రైవేటీకరించడమో చేయొచ్చని తెలిపారు.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8. సూర్యకుమార్‌ సరి కొత్త చరిత్ర.. ప్రపంచం‍లోనే తొలి ఆటగాడిగా
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తిరువనంతపురం వేదికగా ప్రోటీస్‌తో జరిగిన తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్‌ విజయ భేరి మోగించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 తేడాతో టీమిండియా ముందంజ వేసింది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9. మిస్‌ యూ నానమ్మ.. నువ్వు మళ్లీ తిరిగి రావాలి..: సితార ఎమోషనల్‌ పోస్ట్‌
నానమ్మను తలుచుకుంటూ సితార సోషల్‌ మీడియా వేదికగా ఎమోషనల్‌ అయ్యింది. నిన్న(సెప్టెంబర్‌ 28) సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10. అనంతపురం: విషాదాన్ని మిగిల్చిన ‘గాడ్‌ ఫాదర్‌’ 
అనంతపురం వేదికగా బుధవారం నిర్వహించిన ‘గాడ్‌ఫాదర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విషాదాన్ని మిగిల్చింది. తమ అభిమాన హీరోని చూడాలన్న ఆత్రుత ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది.

👉పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top