ప్రభుత్వానికి రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హెచ్చరిక
ఉప్పల్: రాష్ట్రంలోని రా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర రా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు బుధవారం ఉప్పల్ భగాయత్‌లోని వంజరి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిధిగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈసీ సభ్యుడు సయ్యద్ రఫీ పాల్గొన్నారు.
సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వూట్కూరి వీరేశం, కోశాధికారి విశ్వనాథం వెంకటరమణ పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. «నెలరోజుల్లోపు మిల్లర్ల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, ఉన్నతాధికారులు స్పందించకుంటే ఈనెల 6న ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే 11వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులను బంద్ చేస్తామని హెచ్చరించారు.


