
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 14వ తేదీన తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త కార్డుల పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. 2.4 లక్షల కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. 11.30 లక్షల మంది నిరుపేదలకు ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం వెల్లడించింది.
గడిచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 41 లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ చేసిన సర్కార్.. కొత్తగా జారీ చేసిన రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422కు చేరుతుంది. మొత్తంగా 3 కోట్ల 14 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.