Bharat Jodo Yatra: Rahul Gandhi Turns Potharaju, Video Viral - Sakshi
Sakshi News home page

పోతరాజు అవతారం.. కొరడాతో కొట్టుకున్న రాహుల్‌

Nov 3 2022 11:33 AM | Updated on Nov 3 2022 3:01 PM

Rahul Gandhi Turns Potharaju At Bharat Jodo Yatra Sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పోతరాజు అవతారం ఎత్తారు. ఆయన తలపెట్టిన భారత్‌ జోడో యాత్ర ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పోతురాలు రాహుల్‌ను కలిశారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బోనాలు, పోతురాజుల గురించి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాహుల్‌కు వివరించారు. ఈ క్రమంలో పోతరాజుల నుంచి కొరడా అందుకున్న రాహుల్‌ దానితో కొట్టుకున్నారు. రాహుల్‌ చేసిన విన్యాసానికి కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అవాక్కయ్యారు.

మరోవైపు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలో ఉల్లాసంగా.. ఉత్సాహంగా సాగుతోంది.. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారురు. ఏఐసీసీ, రాష్ట్ర అగ్రనేతలు ఆయన వెంట నడుస్తున్నారురు. బుధవారం సాయంత్రం 4.10 గంటలకు జోడో యాత్ర సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించగా.. బీహెచ్‌ఈఎల్‌ లింగంపల్లి వద్ద కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి రామచంద్రాపురం, పటాన్‌చెరు మీదుగా ముత్తంగి వరకు సుమారు 11 కి.మీ పాదయాత్ర కొనసాగింది.  
చదవండి: రాజాసింగ్‌పై వందకుపైగా క్రిమినల్‌ కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement