పోలీస్‌స్టేషన్‌కు ప్రొఫెసర్‌ కాశిం

Professor Kasim Attend At Mulugu Police Station In Siddipet - Sakshi

సాక్షి, సిద్దిపేట: ప్రొఫెసర్‌ కాశిం ఆదివారం ములుగు పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. విప్లవ సాహిత్యం కలిగి ఉండటం, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయనపై గతంలో ములుగు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కండీషనల్‌ బెయిల్‌ పొందిన ప్రొఫెసర్‌ కాశిం నిబంధనల మేరకు ములుగు పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా జైలులో శిక్ష అనుభవిస్తున్న సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఖైదీల విడుదలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. తన అరెస్టును నిరసిస్తూ విడుదలకు సహకరించిన వారందరికీ కృతఙ్ఞతలు కాశిం కృతజ్ఞతలు తెలిపారు.
(చదవండి: విద్యార్థుల్ని మావోలుగా మార్చే యత్నం)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top