సీఎం కేసీఆర్‌తో ముగిసిన పీకే భేటీ.. టెన్షన్‌లో ఎమ్మెల్యేలు!

Prashant Kishor And CM KCR 2nd Day Meeting Ends At Pragati Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌లో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ టెన్షన్‌ మొదలైంది. వరుసగా రెండు​ రోజులుగా ముఖ్యమంత్రి కేసీర్‌తో పీకే మంతనాలు జరుపతున్న విషయంత తెలిసిందే. ఆదివారం సీఎం కేసీఆర్‌ జరిగిన పీకే భేటీ ముగిసింది. అయితే కేసీర్‌కు ప్రశాంత్‌ కిషోర్‌కు పలు నియోజకవర్గాకుల సంబంధించిన సర్వే రిపోర్టులు అందజేసినట్లు సమాచారం.

పీకే భేటీతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ మొదలైంది. ముఖ్యంగా ఆదివారం జరిగిన భేటీలో జాతీయ రాజకీయాలపై పీకే.. సీఎం కేసీఆర్‌తో సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే తెలంగాణలో పీకే టీమ్‌ సర్వేలు చేస్తున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్‌ పార్టీలో పీకే చేరుతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీతో ముందుకు కొనసాగుతారా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఈ భేటీలో ఐప్యాక్‌ టీమ్‌ చేసిన సర్వే రిపోర్టులను టీఆర్‌ఎస్‌ పార్టీకి అందిస్తుందని పీకే.. కేసీఆర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.

తాను కాంగ్రెస్‌లో చేరిన తన సంస్థ ఐప్యాక్ టీఆర్ఎస్ కోసం పని చేస్తుందని కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ తెలిపినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలు, బీజేపీని ఢీకొట్టడంపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగింది. భవిష్యత్తులో మూడో కూటమి ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ను కూడా కలుపుకుపోవాలనే  విషయంపై ఆలోచించాలని కేసీఆర్‌ను  ప్రశాంత్ కిషోర్ కోరినట్లు సమాచారం. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కతాటిపై ఉంటేనే ఆ పార్టీని గద్దె దింపాలని పీకే వివరించారు. ఐప్యాక్‌.. తెలంగాణలో వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ కోసం పని చేయనుంది.  పీకేతో భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌.. ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లారు.

చదవండి: గడీల రాజ్యం పోయి.. గరీబోళ్ల ప్రభుత్వం రావాలి:  బండి సంజయ్

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top