
యువకుడిపై పోక్సో కేసు నమోదు
హైదరాబాద్ : యువకుడిపై పోక్సో కేసు నమోదైన సంగటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిన వివరాల ప్రకారం.. మేడిపల్లి కి చెందిన బాలిక(17)ను చిన్నతనంలోనే తన అక్కకు, బావకు పిల్లలు లేకపోవడంతో బాలికను దత్తత ఇచ్చారు. అప్పటినుంచి బాలిక వారితోనే మేడిపల్లిలో పెరిగింది.పెంపుడు తల్లి సంవత్సరం క్రితం జబ్బుపడి మరణించగా అప్పటినుంచి బాలిక చదువు మానేసి తండ్రితోనే ఉంటోంది. ఈ సందర్బంగా బాలికకు ఒక సంవత్సర కాలంగా స్నాప్‌చాట్ అనే యాప్‌లో అలియాబాద్‌కు చెందిన యువకుడు పరిగి రవితేజ్(23)తో పరిచయం ఏర్పడింది.
కాగా బాలిక తండ్రి అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు అదునుగా చేసుకుని ప్రేమ పేరుచెప్పి మాయమాటలతో బాలికను లోబర్చుకుని గత రెండునెలలుగా బాలిక ఇంట్లోనే సహజీవనం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న బాలిక కన్నతల్లి మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసింది. తల్లి పిర్యాదుమేరకు నిందితుడిపై పోక్సోకేసును నమోదు చేసి నిందితున్ని రిమాండ్‌కు తరలించినట్లు మేడిపల్లి సీఐ గోవింద రెడ్డి తెలిపారు.