ఎమ్మెల్యేల కేసు: ఏసీబీ కోర్టు తీర్పు సవాల్‌ చేస్తూ హైకోర్టుకు సిట్‌

Poaching Case SIT Approached High Court Challenging ACB Court Verdict - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్‌ విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి సిట్‌.. హైకోర్టును ఆశ్రయించింది. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్‌ చేసింది. 

అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యహహారంలో బీఎల్‌ సంతోష్‌, జగ్గుస్వామి, తుషార్‌లపై సిట్‌ మెమో పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా, మెమో పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్‌.. రివిజన్‌ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలో సిట్‌ పిటిషన్‌ విచారణకు హైకోర్టు అనుమితిచ్చింది. సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం 2:30 విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్‌ నాగార్జున్‌ స్పష్టం చేశారు. 

ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న సింహయాజి బుధవారం జైలు నుంచి విడదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన వారం తర్వాత బుధవారం సింహయాజి విడుదలయ్యారు. ఇక ఈ కేసులో.. మరో ఇద్దరు నిందితులు జైల్లోనే  ఉన్నారు. ముగ్గురు నిందితులకు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజులుకు వారం క్రితమే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. కేసులు పెండింగ్‌లో ఉండటంతో రామచంద్ర భారతి, నంద కుమార్‌లు జైల్లోనే ఉండాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top