సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్‌ చెప్పిన ‍ప్రధాని మోదీ, గరవ్నర్‌ తమిళిసై

PM Modi Governor Tamilisai Birthday Wishes To CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నేడు(ఫిబ్రవరి 17) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు. ఈరోజు ఆయన 69వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

అదే విధంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌,  ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో జీవితం అర్థవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి, జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రముఖులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు సీఎం పుట్టినరోజు వేడుకలను  ఘనంగా నిర్వహిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top