Photo Story: ‘వరంగల్‌’.. జిగేల్‌ 

Photo Story: Warangal Urban Collector Building Ready To Inaugurate - Sakshi

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయ భవన సముదాయమిది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం దీనిని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా విద్యుద్దీపాలతో శనివారం ఇలా సర్వాంగ సుందరంగా అలంకరించగా.. ఆ అందాలను డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యమిది.    


– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, వరంగల్‌ అర్బన్‌  

కాడెద్దులకు సాగు శిక్షణ
మహాముత్తారం: వ్యవసాయంలో యంత్రాల వినియోగం పెరిగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సైతం దుక్కులు దున్నే ఎద్దులు కనుమరుగవుతున్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో రైతులు ఇప్పటికీ భూములు దున్నేందుకు కాడెద్దులపైనే ఆధారపడుతున్నారు. అందుకోసం ఒక వయస్సుకు వచ్చిన ఎద్దులకు గిర్ర కట్టి శిక్షణ ఇస్తారు. తర్వాత బరువులను లాగడం, పొలాలు, చేన్లు దున్నే సమయంతో పాటు బండి కట్టినప్పుడు చెప్పినట్లుగా నడుచుకునేలా వాటికి మరికొన్ని రోజులు బండిపై తర్ఫీదు నిస్తారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం సింగంపల్లి అటవీ ప్రాంతంలో ఓ రైతు కాడెద్దులకు గిర్ర కట్టి శిక్షణ ఇచ్చే దృశ్యాలు ‘సాక్షి’కెమెరాకు చిక్కాయి.

నిండుకుండలా పార్వతీ బ్యారేజీ
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కన్నెపల్లి లక్ష్మి, అన్నారం సరస్వతీ పంప్‌హౌస్‌ల నుంచి నీటిని విడుదల చేయడంతో పెద్దపల్లి జిల్లా మంథని మండలం సుందిళ్లలోని పార్వతీ బ్యారేజీ నిండుకుండను తలపిస్తోంది. పార్వతీ పంప్‌హౌస్‌ నుంచి ఐదు మోటార్ల ద్వారా శనివారం ఒక టీఎంసీ నీటిని పార్వతీ బ్యారేజీలోకి డెలివరీ సిస్టర్న్‌ ద్వారా ఎత్తిపోశారు. దీంతో ఈ బ్యారేజీ జలకళను సంతరించుకుంది. 
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
చదవండి: 25న డిస్కవరీలో ‘కాళేశ్వరం’పై డాక్యుమెంటరీ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top