వృద్ధ గోవులకు పింఛను | Pension Given To Elder Cows In Puduru Vikarabad By MP Ranjith Reddy | Sakshi
Sakshi News home page

వృద్ధ గోవులకు పింఛను

Aug 18 2021 8:09 AM | Updated on Aug 18 2021 8:39 AM

Pension Given To Elder Cows In Puduru Vikarabad By MP Ranjith Reddy - Sakshi

పూడూరు: గోమాత రక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ జిల్లా పూడూరు మండల పరిధిలోని దామ గుండం రామలింగేశ్వరాలయాన్ని మంగళవారం  సందర్శించారు. అనంతరం పూడూరుకు చెందిన 20 వృద్ధ గోవులకు రూ.500 చొప్పున పింఛను అందజేశారు.

అమృంతగమయ చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ సత్యానందస్వామి సౌజన్యంతో గోవుల రక్షణ కోసం యజమానికి ప్రతినెలా500 చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్కో ఆవుకు రూ.375తో బీమా చేయించామని, ఆ గోవు మరణిస్తే రైతుకు రూ.35 వేల బీమా అందుతుందని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement