పేదింట ‘హృదయ’వేదన.. చిన్ని గుండెకు పెద్ద కష్టం

Parents Asking Help For Rs 3 Lakh For Child Heart Operation - Sakshi

చిన్నారి గుండె ఆపరేషన్‌కు రూ.3లక్షలు 

దాతలు కరుణించాలని కన్నోళ్ల వేడుకోలు  

నెన్నెల(ఆదిలాబాద్‌ జిల్లా): భార్యాభర్తలు కూలీ పనులకు వెళ్తే కాని పూట గడవని పరిస్థితి. అలాంటి కుటుంబంలో అబ్బాయి పుట్టాడని కష్టాలను మరిచి సంతోషపడ్డారు. బాలుడు గుక్కపెట్టి ఏడుస్తుంటే కంగారుపడి డాక్టర్‌కు చూపించారు. బాలుడికి గుండె సమస్య ఉందని వైద్యులు తెలుపడంతో అప్పటి వరకు మురిసిపోయిన తల్లిదండ్రులు ఒక్కసారి దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చిన్నారికి గుండె జబ్బు ఉందని తెలిసి ఆ పేద దంపతులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.

చదవండి: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

నెన్నెల మండలం నందులపల్లికి చెందిన కామెర సతీష్‌ – పుష్పలత దంపతులకు మూడు రోజుల క్రితం బాబు పుట్టాడు. ఆ చిన్నారికి గుండె సంబంధిత సమస్య ఉండడంతో హైదరాబాద్‌ రేయిన్‌బో ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు ఆపరేషన్‌ చేయాలని నిర్ధారించారు. ఇందుకు రూ.3 లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. చేతిలో చిల్లిగవ్వ లేదని ఆ చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారం రోజుల్లో ఆపరేషన్‌ చేయకుంటే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు తెలిపారని ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక స్థోమత లేక సతమతమవుతున్నారు. దాతల సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సాయం చేసి బిడ్డ ప్రాణం కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. 
స్పందించాల్సిన దాతలు...
ఫోన్‌పే, గూగుల్‌ పే 8008484410   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top