ఆన్‌లైన్‌ మోసం.. ఫోన్‌ ఆర్డర్‌ చేస్తే సబ్బు వచ్చింది!

Online Fraud: Man Ordered Smartphone Received Soap Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: ఇంటర్నెట్‌ వాడకం పెరిగినప్పటి నుంచి ఆన్‌లైన్‌ కొనుగోళ్లపై కస్టమర్లు మక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే ఏది కావాలన్న కూర్చున్న చోట నుంచే ఆర్డర్‌ పెడితే చాలు మన ముందుకు వస్తున్నాయి. అయితే ఒక్కోసారి మాత్రం ఒకటి ఆర్డర్‌ పెడితే ఇంకోటి ప్రత్యక్షమై, కస్టమర్లను కంగారుపడిన ఘటనలు బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ వ్యక్తి  ఆన్‌లైన్‌లో ఫోన్‌ బుక్‌ చేస్తే బట్టల సబ్బు దర్శమిచ్చింది.

ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో వెలుగు చూసింది. వివరాల ప్రకారం భీమన్న ఆన్‌లైన్‌ లోని ఓ యాప్‌ ద్వారా మొబైల్‌ కొనుగోలు చేశాడు. అందుకుగాను అతను రూ.6100 చెల్లించి ఫోన్‌ బుక్‌ చేసుకున్నాడు. అనుకన్నట్లే ఫోన్‌ ప్యాక్‌ చేసిన పార్శిల్‌ అతని ఇంటికి వచ్చింది. కొత్త ఫోన్‌ చూద్దామని ఎంతో ఆశగా పార్శిల్‌ తెరవగా అందులో ఫోన్‌కి బదులుగా బట్టల సబ్బు దర్శనమిచ్చింది. దీంతో భీమన్న షాకయ్యాడు. తనకు న్యాయం జరిగేలా చూడాలని సదరు ఆన్‌లైన్‌ సంస్థను విజ్ఞప్తి చేస్తున్నాడు.

చదవండి: Amnesia Pub Case: జూబ్లీహిల్స్‌ పబ్‌ కేసు: చిక్కిన ఐదుగురు నిందితులు.. అందరూ పొలిటికల్‌ లీడర్ల కొడుకులే

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top