‘కాళ్లు మొక్కుతా సారు..  నాకు వద్దంటే వద్దు’ 

Old Woman Refused To Take Covid 19 Vaccine Over Side Effects - Sakshi

మొండికేసిన వృద్ధురాలు 

నచ్చజెప్పి వ్యాక్సిన్‌ వేయించిన డీపీఓ సురేశ్‌మోహన్‌ 

సాక్షి,జోగిపేట(హైదరాబాద్‌): కాళ్లు మొక్కుతా నాకు సూది(వ్యాక్సిన్‌) వద్దు అంటూ ఒక వైపు బతిమిలాడుతూనే మరొక వైపు వైద్య సిబ్బందిని దగ్గరకు రానీయకుండా మొండికేయడంతో అధికారులు నచ్చజెప్పి ఎట్టకేలకు ఆ వృద్ధురాలికి వ్యాక్సిన్‌ ఇప్పించగలిగారు. ఆదివారం అందోలు మండలంలోని కొడెకల్, డాకూరు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వ్యాక్సిన్‌ తీసుకోని వారికి ఇప్పించారు. డాకూరు గ్రామంలో మైదాకుచెట్టు షరీఫాబీ(70) ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి వ్యాక్సిన్‌ వేసుకోమని కోరగా అందుకు నిరాకరించింది.

కాళ్లు మొక్కుతానని, నాకు సూది ఇవ్వొదని మొరపెట్టుకుంది. అక్కడే ఉన్న జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేసుకోవాలని నచ్చజెప్పారు. ఇంట్లోకి వెళ్లి దాని వల్ల ఏమి భయంలేదని, కరోనా వచ్చినా తట్టుకుంటారని చెప్పి ఎట్టకేలకు వ్యాక్సిన్‌ వేయించారు. అరగంట సేపు సిబ్బందిని ఇబ్బంది పెట్టిన మహిళ వ్యాక్సిన్‌ వేసుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని డీపీఓ సూచించారు.

చదవండి: వంద కోసం అటెండర్‌ కక్కుర్తి.. పసి ప్రాణం బలైపోయింది

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top