ఆస్పత్రిలో పక్కా ప్లాన్‌: సెంట్రీ బిర్యానీలో మత్తు మందు కలిపి

Odisha Gangster Sheikh Hyder‌ Absconding Police Found The Sketch To Escape - Sakshi

సెంట్రీ ఆహారంలో మత్తుమందు కలిపాడు 

చిక్కకూడదనే కారును వదిలేశాను 

విచారణలో వెల్లడించిన గ్యాంగ్‌స్టర్‌ హైదర్‌

హత్నూర్‌లో టాస్క్‌ఫోర్స్‌కు చిక్కింది ఇతడే.. 

సాక్షి, సిటీబ్యూరో: ఒడిస్సాలోని కటక్‌ ఆసుపత్రి నుంచి తప్పించుకుని, నార్త్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌ పోలీసులకు జహీరాబాద్‌ రూరల్‌ పరిధిలోని హత్నూర్‌లో చిక్కిన ఘరానా గ్యాంగ్‌స్టర్‌ షేక్‌‌ హైదర్‌ విచారణలో ఆసక్తికర కీలకాంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాను తప్పించుకోవడానికి తన ప్రధాన అనుచరుడు యూకూబ్‌ సాయం చేసినట్లు అంగీకరించాడు. భువనేశ్వర్, కటక్, పూరీ జిల్లాల్లో నమోదైన అనేక హత్య, హత్యాయత్నం, బెదిరింపులు, దోపిడీ కేసుల్లో హైదర్‌ నిందితుడిగా ఉన్నాడు. సొంతంగా ఓ ముఠా ఏర్పాటు చేసుకున్న ఇతగాడు గ్యాంగ్‌స్టర్‌ అవతారం ఎత్తాడు.
  
శిక్ష అనుభవిస్తుండగానే.. 
పలుమార్లు పోలీసులు అరెస్టు చేసినా తేలిగ్గా బెయిల్‌ పొంది బయటకు వచ్చాడు. ప్రత్యర్థి గ్యాంగ్‌స్టర్‌ షేక్‌ సులేమాన్‌ సోదరుడు షేక్‌ చాను హత్య కేసులోనూ ఇతడికి జీవితఖైదు పడింది. ఈ శిక్ష అనుభవిస్తుండగానే భువనేశ్వర్‌కు చెందిన మైన్స్‌ యజమాని రష్మీరాజన్‌ మొఘాప్తారా కిడ్నాప్, హత్య కేసులోనూ ఇదే తరహా శిక్షకు గురయ్యాడు. ఈ కేసుల్లో ఏకకాల శిక్ష అనుభవిస్తూ హైదర్‌ నాలుగేళ్ల క్రితం వరకు భువనేశ్వర్‌లోని ఝార్పాడ జైల్లో ఉన్నాడు.  
(చదవండి: కాంగ్రెస్‌ అభ్యర్థి మృతి.. పిప్పిలి ఉప ఎన్నిక వాయిదా!)

కిడ్నీ సమస్య వచ్చిందంటూ.. 
ఝార్పాడ జైలు నుంచీ దందాలు చేస్తున్నాడని, తప్పించుకోవడానికి పథక రచన చేస్తున్నాడని ఒడిస్సా నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో 2018లో ఇతడిని అధికారులు సబల్‌పూర్‌ జైలుకు మార్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అనునిత్యం పహారాలో ఉంచారు. తనకు కిడ్నీ సమస్య వచి్చనట్లు ఇటీవల అక్కడి జైలు అధికారులకు చెప్పిన హైదర్‌ చికిత్స కోసమంటూ మార్చి 23న కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజీ ఆసుప్రతిలో చేర్చేలా చేశాడు. అక్కడకు తరచుగా తన అనుచరులు, కుటుంబీకుల్ని విజిటర్స్‌గా పిలిపించుకునే వాడు. వీళ్ల తాకిడి ఎక్కువగా ఉన్నప్పటికీ సెంట్రీ విధుల్లో ఉండే అధికారులు పట్టించుకోలేదు. కేవలం ఒకే కానిస్టేబుల్‌ను సెంట్రీగా ఉంచారు. దీన్ని ఆసరాగా చేసుకున్న హైదర్‌ తన కుడిభుజం యాకూబ్‌తో కలిసి ఎస్కేప్‌కు స్కెచ్‌ వేశాడు.  

బిర్యానీలో మత్తుమందు కలిపి.. 
నాలుగు రోజుల పాటు క్రమం తప్పకుండా తనను కలవడానికి వస్తూ సెంట్రీ విధుల్లో ఉన్న వారిని మచి్చక చేసుకోవాలని సూచించాడు. అలా చేస్తూ వచి్చన యాకూబ్‌ తరచూ వారికి బిర్యానీ పొట్లాలు తీసుకువచ్చి అందించే వాడు. ఈ నెల 5న మత్తుమందు కలిపిన బిర్యానీని సెంట్రీకి అందించాడు. అతడు మత్తులోకి జారు కోగా.. హైదర్‌ అక్కడ నుంచి తప్పించుకున్నాడు. యాకూబ్‌ సమకూర్చిన స్విఫ్ట్‌ వాహనంలో(ఓడీ 02 ఏఎస్‌ 6770) ఒడిస్సా నుంచి ఈ గ్యాంగ్‌స్టర్‌ విశాఖపట్నం, విజయవాడ మీదుగా ప్రయాణించి హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఇక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా తన కారును గుర్తిస్తారని, దాన్ని పెద్ద అంబర్‌పేట వద్ద వదిలేసినట్లు హైదర్‌ బయటపెట్టాడు. ఇతడికి షెల్డర్‌ ఇచి్చన హైదరాబాద్‌లోని కింగ్‌ కోఠి, హత్నూర్‌లకు చెందిన ఇద్దరు ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని ఒడిస్సా పోలీసులు పరిశీలిస్తున్నారు.  
(చదవండి: ఆస్పత్రి నుంచి ఉడాయించిన గ్యాంగ్‌స్టర్‌ షేక్‌ హైదర్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top