గూడెమంతా గుడిసెలే.. ఒక్కరికీ ఇల్లు రాలే! | No Indiramma House For Kandlapalli Naikapugudem Birpur Mandal | Sakshi
Sakshi News home page

గూడెమంతా గుడిసెలే.. ఒక్కరికీ ఇల్లు రాలే!

Jan 23 2025 5:36 AM | Updated on Jan 23 2025 8:58 AM

No Indiramma House For Kandlapalli Naikapugudem Birpur Mandal

సారంగాపూర్‌: జగిత్యాల జిల్లాలోని బీర్‌పూర్‌ మండలం కండ్లపల్లి నాయికపుగూడెంలో గ్రా­మ­స్తులందరికీ పూరిళ్లే ఉన్నా, ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు రాలేదు. ఈ గిరిజన గూడెంలో 60 కుటుంబాలున్నాయి. అందరివీ పూరి గుడిసెలే. ప్రజాపాలన కార్యక్రమంలో ఈ గూడెంవాసులంతా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించిన అధికారులు ఇటీవల గ్రామంలో సర్వే కూడా చేశారు. 

కానీ తాజాగా నిర్వహించిన గ్రామసభలో ప్రద­ర్శించిన జాబితాలో ఆ గూడేనికి చెందిన ఏ ఒక్కరి పేరు లేదు. దీనిపై రెవెన్యూ పరి­శీలకుడు శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. నాయి­కపుగూడెంలోని గుడిసెలన్నీ రిజర్వ్‌ ఫారెస్ట్‌ కిందకు వస్తున్నందున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని తెలిపారు. తమ ఇళ్లు రిజర్వ్‌ ఫారెస్ట్‌ కిందకు వచ్చినప్పుడు అధికారులు సర్వే ఎందుకు చేశారని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement