వైద్యుల నిర్లక్ష్యం; 3 రోజుల పసికందు మృతి.. | Sakshi
Sakshi News home page

జిల్లా ఆసుపత్రిలో 3 రోజుల పసికందు మృతి..

Published Mon, Apr 5 2021 1:30 PM

Nizamabad: 3 Days Old Infant Died Due To Doctors Negligence - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం 3 రోజుల పసికందు మృతిచెందింది. ‍ వివరాలు.. పెద్ద కొడప్‌గల్‌ మండలం తక్కపల్లికి చెందిన ఓ మహిళ డెలివరీ కోసం మూడు రోజుల క్రితం ప్రభుత్వం ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో అరుణ్‌, జయశ్రీ దంపతులకు ఆడపిల్ల జన్మించింది. అయితే పాప పుట్టిన తర్వాత జాండీస్‌ రావడంతో వెంటిలేటర్‌ అవసరమైంది.

అప్పటికే కుటుంబ సభ్యులు ఓ నెగిటివ్‌ బ్లడ్‌ రెండు బాటిళ్లు తీసుకొచ్చారు. ఈలోపే పాప కన్నుమూసింది. దీంతో వెంటిలేటర్ అందుబాటులో లేకపోవడంతో శిశువు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే పాప మరణించిందని బంధులవులు ఆందోళన చేపట్టారు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రావద్దని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

చదవండి: బీభత్సం‌.. అర్ధరాత్రి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు!

Advertisement
Advertisement