ఫ్యాన్సీ నంబర్‌ కోసం తెగ పోటీ.. నిర్మల్‌లో ఇదే మేటి! | Nirmal: Craze for Fancy Numbers Continues 9999 Sold For Rs 4 80 Lakh | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ నంబర్‌ కోసం తెగ పోటీ.. నిర్మల్‌లో ఇదే మేటి!

Sep 9 2022 2:58 PM | Updated on Sep 9 2022 2:58 PM

Nirmal: Craze for Fancy Numbers Continues 9999 Sold For Rs 4 80 Lakh - Sakshi

నిర్మల్‌ రవాణా కార్యాలయంలో కూడా ఓ వాహనదారుడు ఫ్యాన్సీ నంబర్‌ కోసం గురువారం రూ.4.80 లక్షలు వేలంపాడి దక్కించుకున్నాడు.

నిర్మల్‌ చైన్‌గేట్‌: ఇష్టమైన వాహనాలు కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు, రూ.కోట్లు వెచ్చిస్తుంటారు. చాలామంది ఫ్యాన్సీ నంబర్‌ కోసం తెగ పోటీ పడుతుంటారు. ఎన్ని డబ్బులైనా వెచ్చించి సొంతం చేసుకుంటారు. నిర్మల్‌ రవాణా కార్యాలయంలో కూడా ఓ వాహనదారుడు ఫ్యాన్సీ నంబర్‌ కోసం గురువారం రూ.4.80 లక్షలు వేలంపాడి దక్కించుకున్నాడు.

టీఎస్‌18–జీ 9999 ఫ్యాన్సీ నంబర్‌కు నిర్మల్‌ ఆర్టీవో అజయ్‌రెడ్డి సమక్షంలో ఆన్‌లైన్‌లో వేలం నిర్వహించారు. శ్రీపతి సంతోష్‌కుమార్‌ రూ.4,80,000కు దక్కించుకున్నాడు. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్‌ కోసం ఇంత మొత్తం వెచ్చించడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. 

అలాగే టీఎస్‌18–హెచ్‌ 0009 నంబర్‌ను వెంకట సత్యశ్రీధర్‌ వర్మ రూ.3,15,999కి దక్కించుకున్నాడు. టీఎస్‌18–హెచ్‌ 0001 నంబర్‌ను తడ్క నాగజ్యోతి రూ.2,02,000కు, 0002 నంబర్‌ను విజయ్‌ భాస్కర్‌రెడ్డి రూ.1,05,000కు, 0008ను కొంతం ప్రణయ్‌రెడ్డి రూ.12,124కు, 0007ను పూర్ణమ్మ రూ.55,678కు, 0004 ను తుంగెన ధర్మారావు రూ.16,434కు పొందారు. (క్లిక్‌: రికార్డు ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement