సాగర్‌ ఎడమ కాల్వకు మరమ్మతులు

Nagarjuna Sagar Project Left Canal Repair Works started - Sakshi

ప్రాజెక్టు సీఈ, ఎస్‌ఈ పర్యవేక్షణలో పనులు

నిడమనూరు: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమ కాల్వకు అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించారు. నల్లగొండ జిల్లా నిడమనూరు సమీపంలోని వేంపాడు వద్ద బుధవారం సాయంత్రం సాగర్‌ కాల్వ కట్ట తెగిన విషయం తెలిసిందే. శుక్రవారం అధికారులు కాల్వ కట్టకు ర్యాంప్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారా కాల్వలోకి మట్టి, ఇసుక బస్తాలను తరలిస్తున్నారు.

కాల్వలో నీటిని నిలిపేందుకు ఇసుక బస్తాలను అడ్డుగా వేస్తున్నారు. దానిని ఆసరాగా చేసుకుని మట్టి కట్టను ఐదు అడుగుల ఎత్తు పోయనున్నారు. కాల్వలో వస్తున్న సీపేజ్‌ వాటర్‌ను నిలువరించిన వెంటనే గండిని పూడ్చే పనులను చేపట్టే అవకాశం ఉన్నది. సాగర్‌ ప్రాజెక్టు సీఈ శ్రీకాంత్‌రావు, ఎస్‌ఈ ధర్మా ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి.  

సీపేజ్‌ అంటే..: కాల్వకు నీరు నిలిపివేసిన తర్వాత కూడా అందులో ఉన్న నీరు పారుతుంటుంది. దీనినే సీపేజ్‌ వాటర్‌గా పేర్కొంటారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top