MP Komatireddy Venkat Reddy Helps Poor Student Goes Viral- Sakshi
Sakshi News home page

చదువుల తల్లికి అండగా నిలిచిన కోమటిరెడ్డి

Jan 2 2022 6:37 AM | Updated on Jan 2 2022 2:45 PM

MP Komatireddy Venkat Reddy Helps Poor Student  - Sakshi

వర్షిణికి నగదు అందజేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి 

సాక్షి, నల్లగొండ: నల్లగొండలోని గొల్లగూడ పెద్దబండకు చెందిన బోడ అమృత వర్షిణి తండ్రి ఆటో డ్రైవర్, తల్లి టైలర్‌గా పని చేస్తోంది. వీరి సంపాదన కుటుంబ పోషణకే ఖర్చవుతోంది. ఇలాంటి పరిస్థితిలోనే అమృత వర్షిణి తన చదువును కొనసాగిస్తోంది. కష్టపడి చదివిన అమృత వర్షిణి పైలెట్‌గా ఎంపికైంది. ప్రస్తుతం ట్రైనింగ్‌ దశలో ఉన్న వర్షిణి తన చదువును పూర్తి చేయాలంటే రూ.6 లక్షలు అవసరం ఉంది.

ఆమె కుటుంబ నేపథ్యంతో డబ్బులు కట్టడం కష్టంగా మారింది. దీంతో ఆమె తన పరిస్థితిని, లక్ష్యాన్ని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి వాట్సాప్‌ ద్వారా తెలియజేసింది. వెంటనే స్పందించిన ఆయన అమృతవర్షిణిని తన ఇంటికి పిలిపించుకుని రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. చదువు పూర్తయ్యే వరకు ఖర్చుతానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్లగొండ జిల్లా నుంచి ఎప్పటి వరకు డాక్టర్లు, ఇంజనీర్లను మాత్రమే చదవించిన తాను ఇప్పుడు అమృతవర్షిణి పైలెట్‌ చదువుకు సాయం చేయడం సంతోషంగా ఉందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement