
వెస్ట్, సౌత్ వెస్ట్ జోన్లకు మరో అదనపు డీసీపీ
సీనియర్ అధికారి ఇక్బాల్ సిద్ధిఖీకి అవకాశం
నగరంపై పట్టున్న ఆఫీసర్‌గా ఈయనకు పేరు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నగర పోలీసు విభాగానికి గుండెకాయ వంటి టాస్క్‌ఫోర్స్‌ను పునర్ వ్యవస్థీకరించారు. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇకపై టాస్‌్కఫోర్స్‌కు డీసీపీతో పాటు ఇద్దరు అదనపు డీసీపీలు ఉండనున్నారు. కొత్త అదనపు డీసీపీగా సీరియర్ పోలీసు అధికారి మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీని నియమించిన కొత్వాల్ ఆయనకు వెస్ట్, సౌత్ వెస్ట్ జోన్ల బాధ్యతలు అప్పగించారు.
ఒకప్పుడు నాలుగు.. ఇప్పుడు ఐదు.
నగర కమిషనరేట్‌లో ఒకప్పుడు కేవలం నాలుగు జోన్లే ఉండేవి. ఆపై వీటి సంఖ్య ఐదుకు పెరిగింది. ప్రతి జోన్‌కు బాధ్యత వహిస్తూ ఓ టాస్‌్కఫోర్స్ బృందం ఉంటుంది. వీటన్నింటినికీ నాన్ క్యాడర్ లేదా అదనపు ఎస్పీ స్థాయిలో ఉన్న అధికారి డీసీపీగా నేతృత్వం వహిస్తుంటారు. ఈయనకు సహకరించడానికి ఓ అదనపు డీసీపీ పని చేస్తుండే వారు. అప్పట్లో జోన్ల సంఖ్య ఐదుకు పెరిగినప్పుడూ ఇదే విధానం కొనసాగించారు. డీసీపీపై ఉన్న పని ఒత్తిడిని పరిగణనలోకి తీసుకున్న ఉన్నతాధికారులు జోన్లను విభజించారు.
వెస్ట్, నార్త్, సెంట్రల్ జోన్లకు డీసీపీ నేతృత్వం వహించేలా, ఈస్ట్, సౌత్ జోన్లకు అదనపు డీసీపీ నేతృత్వం వహించేలా నిర్ణయం తీసుకున్నారు. దీంతో డీసీపీ కార్యాలయం సికింద్రాబాద్‌లోనే కొనసాగిస్తూ అదనపు డీసీపీకి పాతబస్తీలోని పురానీ హవేలీలో ఏర్పాటు చేశారు. నగరంలో మాదకద్రవ్యాల వ్యతిరేక విభాగం హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) ఏర్పడటంతో పాటు జోన్ల సంఖ్య ఏడుకు చేరింది.
అయినప్పటికీ కొన్నాళ్లు సౌత్ ఈస్ట్, హెచ్–న్యూలు టాస్‌్కఫోర్స్ డీసీపీ అ«దీనంలోనే పని చేశాయి. ఆపై డీసీపీకి హెచ్–న్యూతో పాటు వెస్ట్, సౌత్ వెస్ట్, నార్త్, సెంట్రల్ జోన్లను అప్పగించారు. సాంకేతిక కారణాలతో సౌత్ వెస్ట్ జోన్‌ను అదనపు డీసీపీగా అప్పటిస్తూ గత ఏడాది నిర్ణయం తీసుకున్నారు. తాజాగా టాస్‌్కఫోర్స్‌కు మరో అదనపు డీసీపీగా నియమించిన సీపీ ఆనంద్.. ఆయనకు వెస్ట్, సౌత్ వెస్ట్ టీమ్స్‌ను అప్పగించారు. కొత్త అదనపు డీసీపీగా సీసీఎస్ అదనపు డీసీపీగా ఉన్న ఇక్బాల్ సిద్ధిఖీని నియమించారు.
కీలక బాధ్యతల్లో పని చేసిన సిద్ధిఖీ...
నగర టాస్‌్కఫోర్స్ అదనపు డీసీపీగా నియమితులైన మహ్మద్ ఇక్బాల్ సిద్ధిఖీ ఇప్పటి వరకు అనేక కీలక బాధ్యతల్లో పని చేశారు. సిద్ధిఖీ ఎన్నికల ముందు వరకు పశి్చమ మండల అదనపు డీసీపీగా, ఎన్నికల తర్వాత సౌత్ వెస్ట్ జోన్ అదనపు డీసీపీగా పని చేశారు. దీనికి ముందు ఆయన బంజారాహిల్స్ సహా కీలక ఠాణాలకు ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. ‘షోయబ్ మాలిక్–సానియా మీర్జా’ ఉదంతం చోటు చేసుకున్నప్పుడు సిద్ధఖీనే బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్‌గా ఉండి ఆ వ్యవహారాన్ని సమర్థంగా పర్యవేక్షించారు. ఈయనకు ఈస్ట్‌జోన్ టాస్‌్కఫోర్స్ టీమ్ సబ్–ఇన్‌స్పెక్టర్‌గా, సౌత్ జోన్ టాస్‌్కఫోర్స్ టీమ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసిన అనుభవం ఉంది.
పాకిస్థాన్‌లో ముద్రితమైన రూ.500, రూ.1000 నకిలీ నోట్లు ఒకేసారి రూ.2.5 కోట్ల విలువైనవి చిక్కడం నగర పోలీసు చరిత్రలో రికార్డు. 2007 ఆగస్టు 25న పాతబస్తీలో ఈ నకిలీ నోట్లను టాస్‌్కఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో జరిగిన ఈ భారీ ఆపరేషన్‌కు సిద్ధిఖీనే నేతృత్వం వహించారు. అదే ఏడాది నగరంలో చోటు చేసుకున్న మక్కా మసీదులో బాంబు పేలుడు, గోకుల్‌చాట్– లుంబినీ పార్క్‌ల్లో జంట పేలుళ్ల కేసుల దర్యాప్తులోనూ ఇక్బాల్ సిద్ధిఖీ కీలకపాత్ర పోషించారు. సైబరాబాద్‌లో క్రైమ్స్–2 అదనపు డీసీపీగానూ సిద్ధిఖీ పని చేశారు.