
తాను చార్మినార్‌లో కూడా గెలిచి చూపిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు చెప్పారు.
నల్లగొండ టూటౌన్: సిరిసిల్లలో 2009 ఎన్నికల్లో 171 ఓట్లతో గెలిచిన మంత్రి కేటీఆర్.. 1500 ఓట్లతో గెలిచిన తనను అవహేళన చేస్తున్నాడని, తాను చార్మినార్‌లో కూడా గెలిచి చూపిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు చెప్పారు. తండ్రి కేసీఆర్ బొమ్మ లేకుండా కేటీఆర్ సిరిసిల్ల వదిలి వేరేచోట గెలిచి చూపించాలని ఆయన సవాల్ విసిరారు.
నల్లగొండ నియోజకవర్గంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ కార్యక్రమం ముగింపు సందర్భంగా జరిగిన సభలో రఘునందన్‌రావు మాట్లాడారు.
ఇదీ చదవండి: కేసీఆర్‌కు గుడ్‌బై చెప్పాల్సిన సమయం వచ్చింది: జేపీ నడ్డా