వస్తామన్న బస్సు రానే వచ్చింది.. ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌.. తండ్రిని ఆగం పట్టిచ్చిన ఆన్లైన్‌ గేమ్స్‌!

Missing Case Happy Ending Mobile Phone Switched Off Nizamabad District - Sakshi

భిక్కనూరు (నిజామాబాద్‌): మండలంలోని తిప్పాపూర్‌ గ్రామానికి చెందిన వ్యాపారి  భార్య, ఇద్దరు కుమారులు అదృశ్యమయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై ఆనంద్‌గౌడ్‌ వారి ఆచూకీని నాలుగు గంటల్లోనే కనుగొనడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏమి జరిగిందంటే.. తిప్పాపూర్‌ గ్రామానికి చెందిన వ్యా పారి వీరమల్లి శ్రీనివాస్‌కు భార్య శాలిని అలియాస్‌ అశ్విని, ఇద్దరు కుమారులు వరుణ్, లోకేష్‌లు ఉన్నారు.

శాలిని తండ్రి అనారోగ్యానికి గురికావడంతో ఆమె ఇద్దరు కుమారులను తీసుకుని ఈనెల ఒకటవ తేదీ తిప్పాపూర్‌ నుంచి కరీంనగర్‌ వెళ్లి అక్కడ తండ్రిని పరామర్శించి 3వ తేదీ కరీంనగర్‌లో బస్సు ఎక్కి కామారెడ్డికి మధ్యాహ్నం 3.50 గంటలకు చేరుకుంది. తన భర్త శ్రీనివాస్‌కు ఫోన్‌చేసి తిప్పాపూర్‌ రావడానికి రామాయంపేటలో బయలుదేరుతున్నానని భిక్కనూరు నుంచి తనను తిప్పాపూర్‌ తీసుకెళ్లాలని సెల్‌ ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో సాయంత్రం 6.30 గంటలకు ఆయన భిక్కనూరు బస్టాండ్‌కు వచ్చాడు. బస్సులో రాకపోగా ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ కావడంతో తీవ్ర ఆందోళన చెందారు.
చదవండి👉 ఏమై పోయాడో..? స్నానానికి దిగిన యువకుడు అదృశ్యం

ఆమె కుమారులు సెల్‌ఫోన్‌లో గేమ్‌ ఆడటంతో చార్జింగ్‌ అయిపోయి ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ ఆయ్యింది. కాగా తండ్రి మీద ఉన్న మమకారంతో ఆమె తిరిగి కరీంనగర్‌ వెళ్ళాలని నిర్ణయించి కుమారులతో కలిసి సిరిసిల్లి బస్సు ఎక్కారు. సిరిసిల్ల నుంచి కరీంనగర్‌ వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ఆ రాత్రికి అక్కడున్న బంధువుల ఇంటికి వెళ్ళారు. అయితే ఎస్సై ఆనంద్‌గౌడ్‌ తీవ్రంగా కృషి చేసి ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా సిరిసిల్లలో ఉన్నట్లు గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే స్పందించిన ఎస్సైని పలువురు అభినందించారు.   
చదవండి👉🏻 వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top