Minor Medical Report Out In Amnesia Pub Case - Sakshi
Sakshi News home page

Amnesia Pub Case: మెడికల్‌ రిపోర్టు ఔట్‌.. మరీ ఇంత దారుణామా..?

Jun 10 2022 4:00 PM | Updated on Jun 11 2022 8:14 AM

Minor Medical Report Out In Amnesia Pub Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్‌పై సామూహిక లైంగిక దాడి ఘటనలో బాధితురాలి మెడికల్‌ రిపోర్టును వైద్యులు.. పోలీసులకు అందించారు. కాగా, పోలీసులు ఇప్పటికే మైనర్‌కు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. 

కాగా, మెడికల్‌ రిపోర్ట్‌ ప్రకారం.. లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్‌ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఆ సమయంలో మైనర్‌.. లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమెపై గోళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్‌ శరీరంపై 12 గాయాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్‌ మాలిక్‌ను రెండోరోజు పోలీసులు విచారిస్తున్నారు.

ఇక, మైనర్‌పై లైంగిక దాడి కేసులో దర్యాప్తు అధికారులు తొలిరోజు మైనర్లను విచారించారు. జువైనల్‌ హోంలో ముగ్గురు మైనర్లను అధికారులు విడివిడిగా విచారించారు. కాగా, A1 సాదుద్ధీన్‌ చెప్పిన వివరాలతో అధికారులు ముగ్గురిని ప్రశ్నించారు. మైనర్‌ను ట్రాప్‌ చేసింది ఎవరూ అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: బీజేపీకి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ.. చార్మినార్‌ వద్ద టెన్షన్‌.. టెన్షన్‌.. వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement