గద్దర్‌ను కలిసిన టీఆర్‌ఎస్‌ నేతలు | Minister Koppula Eshwar Meets Gaddar | Sakshi
Sakshi News home page

గద్దర్‌ను కలిసిన టీఆర్‌ఎస్‌ మంత్రి

Nov 20 2020 2:38 PM | Updated on Nov 20 2020 2:38 PM

Minister Koppula Eshwar Meets Gaddar - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రజా గాయకుడు గద్దర్‌ను టీఆర్‌ఎస్‌ నేతలు కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వెంకటాపురం డివిజన్‌కు ఇం‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న కొప్పుల ఈశ్వర్‌, మరికొంత మంది నేతలు గద్దర్‌ను కలిశారు. కేవలం మర్వాదపూర్వకంగానే కలిసినట్లు మంత్రి కొప్పుల తెలిపారు. టీఆర్ఎస్ కార్పొరేటర్‌గా వెంకటాపురం డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని గద్దర్‌కు పరిచయం చేశారు. ఆయన నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్‌ అనంతరం కేటీఆర్‌తో పలు సందర్భాల్లో విభేదించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నేతలు ఆయన్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement