గల్ఫ్‌ జైళ్లలో మగ్గుతున్న మనోళ్లు

Migrant Indian Workers In Foreign Jails Lacking Of Knowledge On Law - Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన మన దేశస్తులు పరాయి దేశాల చట్టాలపై అవగాహన లేక చేసిన చిన్నచిన్న తప్పులకు ఆయా దే శాల జైళ్లలోనే మగ్గిపోతున్నారు. రాయబార కా ర్యాలయాల ద్వారా న్యాయసాయం పొందే అవకాశా లు తక్కువగా ఉండడంతో ఏళ్ల తరబడి జైలు పక్షులుగానే ఉండిపోతున్నారు. విదేశీ జైళ్లలో ఉన్న భారతీయుల సంఖ్య, వారికి అందుతున్న న్యాయ సహాయంపై పలువురు ఎంపీలు పార్లమెంట్‌లో చర్చ లేవనెత్తారు. 

దీనిపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ ఇచ్చిన సమాధానం ప్రకారం 82 దేశాల్లో అండర్‌ ట్రయల్‌ ఖైదీలతో పాటు వివిధ కేసుల్లో శిక్షపడి జైళ్లలో ఉన్న భారతీయుల సంఖ్య 8,343 మంది అని తేలింది. ఇందులో 4,755 మంది కేవలం ఆరు గల్ఫ్‌ దేశాల్లోని జైళ్లలో బంధించబడి ఉన్నారు. ఆరు దేశాల జైళ్లలో ఉన్న భారతీయులతో పోలిస్తే ఇతర 76 దేశాల జైళ్లలో ఉన్న వారి సంఖ్య తక్కువగా ఉంది. గల్ఫ్‌ దేశాలతో పాటు మలేషి యా జైళ్లలోనూ భారతీయులు ఎక్కువగానే ఉన్నా రు. అంటే కేవలం ఉపాధి కోసం వెళ్లినవారు వీసా నిబంధనలను అతిక్రమించి జైలు పాలైనట్లు వెల్లమవుతుంది. 

కంపెనీల వీసాలపై వెళ్లి ఆ కంపెనీల్లో పని నచ్చకపోతే కల్లివెల్లి కార్మికులుగా మారి పనిచేయడం చివరకు పోలీసులకు దొరికిపోవడంతో జైలు పాలయ్యారు. మరికొందరు విజిట్‌ వీసాలపై వెళ్లి వీసా గడువు ముగిసినా అక్కడే ఉండిపోవడంతో కటకటాల పాలయ్యారు. ఇదిలా ఉండగా 31 దేశాలతో శిక్షార్హమైన వ్యక్తుల బదిలీపై మన విదేశాంగ శాఖ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇందు లో గల్ఫ్‌ దేశాల్లోని ఒమాన్‌ మినహా మిగిలిన ఐదు దేశాలున్నాయి. అయినా ఖైదు చేయబడ్డ భారతీయులకు విముక్తి లభించడం లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి వివిధ దేశా ల్లోని జైల్‌లో మగ్గుతున్న భారతీయులను మాతృదేశానికి చేరి్పంచాలని పలువురు కోరుతున్నారు.

న్యాయసాయం అందించాలి 
గల్ఫ్‌ దేశాల్లో అండర్‌ ట్రయల్‌ ఖైదీలతో పాటు శిక్షపడిన ఖైదీల సంఖ్యను కేంద్రం వెల్లడించిన సంఖ్య కన్నా ఎక్కువ మందే జైళ్లలో ఉన్నారు. ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మరో ఐదువేల మంది ఔట్‌ జైళ్లలో ఉన్నారని సమాచారం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయసాయం అందించాలి. 
– మంద భీంరెడ్డి, గల్ఫ్‌ వ్యవహారాల విశ్లేషకులు  
 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top