తెలంగాణకు మైక్రోసాఫ్ట్‌ భారీ సహాయం

Microsoft Company Donates Medical Equipment To Telangana - Sakshi

రూ.3.8 కోట్ల విలువ చేసే వైద్య పరికరాలు అందజేత

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న పోరుకు మద్దతు పలుకుతూ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్‌ సంస్థ తమ ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా రూ.3.8 కోట్ల విలువ చేసే వైద్య పరికరాలను అందజేసింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసిన సంస్థ ప్రతి నిధులు వైద్య పరికరాలను అందజేశారు. తాము అందజేసిన 14 అత్యాధునిక కోవిడ్‌ 19 పరీక్ష యంత్రాల ద్వారా రోజుకు 3,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్‌ ఎండీ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. కోవిడ్‌పై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి మైక్రోసాఫ్ట్‌ విరాళం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top