ఎంసీపీఐయూ నేత తాండ్ర కుమార్ మృతి

మియాపూర్: ఎంసీపీఐయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ తాండ్రకుమార్ అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో నాలుగు రోజుల నుండి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో తాండ్రకుమార్ తుదిశ్వాస విడిచారు.
ఆయన పార్థివదేహాన్ని కిమ్స్ ఆస్పత్రి నుండి బాగ్‌లింగంపల్లిలోని ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యాలయం ఓంకార్ భవన్‌కు తరలించారు. అక్కడి నుంచి మియాపూర్‌లోని ఎంఏనగర్‌లో ఉన్న ఎంసీపీఐయూ కార్యాలయంలో సాయంత్రం వరకు ఉంచారు. అనంతరం మియాపూర్‌లోని సొంత ఇంటికి తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
మరిన్ని వార్తలు