సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీర ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కల్లూరు, తల్లాడ మండలాల్లో సోమ వారం ఇందిరమ్మ చీరల పంపిణీలో అధికారులతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇందిరమ్మ చీర ధరించి రావడంపై మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.


