వావ్‌.. వాలుగ! 

Massive 15kg Valuga fish Caught in Paleru Reservoir - Sakshi

సాక్షి, కూసుమంచి: సాధారణంగా ‘వాలుగ’ చేప చిన్నగానే ఉంటుంది. కానీ, మంగళవారం ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్‌లో ఏకంగా 15 కిలోల వాలుగ మత్స్యకారుల వలకు చిక్కింది. ఇక్కడ సోమవారం నుంచి చేపల వేట నిర్వహిస్తుండగా.. మంగళవారం బత్తుల పెద్దఉప్పయ్య అనే మత్స్యకారుడి వలకు ఈ భారీ చేప చిక్కింది.

ఆ మత్స్యకారుడు ఈ చేపను కిలో రూ. 120 చొప్పున ఓ స్థానిక వ్యాపారికి విక్రయించాడు. ఈ రిజర్వాయర్‌లో మరికొన్ని చేపలు సుమారు 20 కిలోల వరకు కూడా బరువు ఉంటాయని ఇక్కడి మత్స్యకారులు తెలిపారు.

ఇక్కడ చదవండి:
అరుదైన ‘ఎర్ర చందనం’ చేప

పోలీసుల్ని చూసి.. పరుగో.. పరుగు!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top