జగిత్యాల: పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో అపశ్రుతి

Man Died In Bike Accident During Pawan Kalyan Visit To Jagtial - Sakshi

సాక్షి, జగిత్యాల: పవన్‌ కల్యాణ్‌ జగిత్యాల జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. కిషన్‌రావుపేట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌ వెళ్తుండగా ప్రమాదంలో  యువకుడు మృతి చెందాడు. బైక్‌పై ఫాలో అవుతుండగా రాజ్‌కుమార్‌ మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని జగిత్యాలలోని ఆసుపత్రికి తరలించారు.

కాగా, జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు శ్రీఆంజనేయస్వామి, ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని మంగళవారం దర్శించుకున్నారు. ఆయన శ్రీఆంజనేయస్వావిుకి శేష వస్త్రాలు, తమలపాకులు, పండ్లు సమర్పించారు.మూలవిరాట్టుకు అభిషేకం చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు జితేంద్రస్వామి, ఉపప్రధాన అర్చకులు చిరంజీవి, అఖిల్‌కృష్ణ, రామ్, లక్ష్మణ్‌.. పవన్‌ కల్యాణ్‌కు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top