TS: నవంబర్‌ 1 నుంచి ఓవర్సీస్‌ విద్యానిధి దరఖాస్తులు

Mahatma Jyotiba Phule Overseas Vidya Nidhi: Apply Online From Nov 1 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద నవంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ బుర్రా వెంకటేశం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్‌ 30వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణకు తుది గడువుగా నిర్దేశించగా.. దరఖాస్తులను ఈపాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. (చదవండి: వచ్చే నెలలో ఎంసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌)

పీజీఈసెట్‌ రిజిస్ట్రేషన్‌ గడువు పెంపు 
టీఎస్‌ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు ఈ నెల 25 వరకు పెంచినట్లు సెట్‌ కన్వీనర్‌ పి.రమేశ్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఫార్మా డీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్‌లో 17,628 అర్హత సాధించారు. వీరిలో ఇప్పటివరకు 7,500 మంది ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వెబ్‌ఆప్షన్స్‌ ఈ నెల 29 నుంచి 31 వరకు ఉంటాయని తెలిపారు. నవంబర్‌ 3వ తేదీన తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుందని, 4 నుంచి 12వ తేదీ వరకూ అభ్యర్థులు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని స్పష్టం చేశారు. వచ్చే నెల 15 నుంచి క్లాసులు మొదలవుతాయని పేర్కొన్నారు.

ఆర్‌ఐఎంసీలో ఎనిమిదో తరగతి బాలికల ప్రవేశాలకు నోటిఫికేషన్‌ 
డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ (ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి బాలికల ప్రవేశాలకు టీఎస్‌పీఎస్సీ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2009 జూలై2 నుంచి 2011 జనవరి 1 మధ్య జన్మించిన బాలికలు మాత్రమే ఈ పరీక్షకు అర్హులని పేర్కొంది. దరఖాస్తులను నవంబర్‌15లోగా సమర్పించాలని స్పష్టం చేసింది. డిసెంబర్‌ 18న హైదరాబాద్‌లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రాంచంద్రన్‌ తెలిపారు. (చదవండి: టీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే తనయుడి నిర్వాకం.. పెళ్లి పేరుతో!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top