అభివృద్ధి పనులపై సమీక్ష 

Kukatpally MLA Madhavaram Krishna Rao Discussed With Collector For Development Programs - Sakshi

కూకట్‌పల్లి: ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన 58, 59 జీఓలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ హరీష్‌తో చర్చించారు. మంగళవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే పలు అంశాలను కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన 58, 59 జీఓలపై చర్చించారు.

దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు 125 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వం క్రమబద్దీకరణ చేస్తుందని తెలిపారు. అంతకు మించి భూమి ఉంటే రిజి్రస్టేషన్‌ ధరలకు అనుగుణంగా నాల్గో వంతు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.  నియోజకవర్గంలో ఇందిరానగర్‌ బస్తీతో పాటు మరికొన్ని బస్తీల్లో క్రమబద్దీకరణ కాని స్థలాల వివరాలను ఎమ్మెల్యే మాధవరం కలెక్టర్‌కు అందజేశారు.

దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని హామీనిచి్చనట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని చెరువులకు సంబంధించి అన్ని ఎస్‌టీపీ ప్లాంట్ల నిర్మాణంలో స్థలాలు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని కలెక్టర్‌ను కోరారు. పెండింగ్‌లో ఉన్న పింఛన్లు   అందించాలని విజ్ఞప్తి చేశారు. మన ఊరు..మన బడి ద్వారా కూకట్‌పల్లి నియోజకవర్గంలో 12 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్‌ హరీష్‌ తెలిపారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top