KTR Urges Party Leaders To Not Make Statements On Purchase Of MLAs - Sakshi
Sakshi News home page

నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు.. పట్టించుకోవద్దు: కేటీఆర్‌

Oct 27 2022 6:27 PM | Updated on Oct 27 2022 7:02 PM

KTR Urges Party Leaders To Not Make Statements On Purchase Of MLAs - Sakshi

అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు...

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికల వేళ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలు విషయంపై మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. 

‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని విజ్ఞప్తి. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన ‍అవసరం లేదు.’ అని ట్వీట్‌ చేశారు కేటీఆర్‌. 

ఇదీ చదవండి: అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement