కేటీఆర్‌ మెచ్చిన ‘పేపర్‌ బాయ్‌’ వెనుక ఆ తల్లి ఉద్దేశం తెలుసా?

KTR Praised Paper Boy: Behind Story His Mother Plays Key Role - Sakshi

సాక్షి, జగిత్యాల: చదివేది ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతే.. కానీ ప్రపంచాన్ని చదివేశాడు.. చేసేది పేపర్ బాయ్ పనే. అయినా చదువుకుంటూ పని చేస్తే తప్పేంటి? అని ప్రశ్నించి అందరినీ ఆకట్టుకున్నాడు. కష్టేఫలి అనే మాటను గుర్తు చేసేలా బుడ్డోడి మాటలకు తెలుగు రాష్ట్రాలు అబ్బురపడ్డాయి. చిన్నప్పటి నుంచే కష్టపడండి కచ్చితంగా సక్సెస్ అవుతారు అంటూ మెసేజ్ కూడా ఇచ్చిన ఆ చిన్నారి ఎవరో కాదు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మెచ్చిన బుడ్డోడు శ్రీ ప్రకాశ్‌ గౌడ్‌.
చదవండి: రాజకీయాల్లో పనికి మాలిన స్టార్ పవన్‌కల్యాణ్‌

జగిత్యాల పట్టణానికి చెందిన శ్రీప్రకాశ్‌ చిన్నప్పటి నుంచి పేపర్ వేయిస్తే పొద్దున్నే లేవటం అలవాటుగా మారి ఉదయం నుంచే సమాజాన్ని గమనిస్తాడని తల్లి పేపర్‌ బాయ్‌గా చేర్పించింది. పెద్ద కొడుకులాగే చిన్న కొడుకును కూడా పేపర్ బాయ్ చేసింది ఆ తల్లి. డబ్బుల అవసరం వారికి లేదు కానీ చిన్నప్పటి నుంచే కష్టపడటం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం కోసం ఇలా చేసినట్లు బుడ్డోడి తల్లి పేర్కొంది.

ప్రపంచం తీరు అన్నీ అర్థం అయ్యేలా చేయాలనేది ఆ మాత్రమూర్తి సంకల్పం. ఇప్పుడు ఆమె అభిలాష నెరవేరింది. చదువుకుంటూ పని చేస్తే తప్పేంటి అనే డైలాగ్‌తో మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు నెటిజన్స్‌ను ఫిదా చేసి సోషల్ మీడియాలో హీరో అయ్యాడు శ్రీప్రకాశ్‌.
చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షాలు: డ్రైనేజీ గుంతలో వ్యక్తి గల్లంతు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top